నందిగామలో జాతీయ న్యాయ సేవ దినోత్సవం

నందిగామలో జాతీయ న్యాయ సేవ దినోత్సవం

NTR: జాతీయ న్యాయ సేవ దినోత్సవ సందర్భంగా నందిగామలోని నెహ్రు నగర్ గిరిజన గురుకుల లేడీస్ హాస్టల్లో న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..1995 నవంబర్ 9వ తేదీన జాతీయ న్యాయ సేవ దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు. దీని ద్వారా ప్రజలందరికీ సమానంగా న్యాయం అందుతుందన్నారు.