ఎన్నికల హామీని నెరవేర్చిన కదిరి ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. నియోజకవర్గంలోని ఎస్సీలకు ప్రతి గ్రామంలో స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించారు. కదిరి రూరల్, నల్లచెరువు, తనకల్లు, తలుపుల, గాండ్లపెంట, నంబులపూలకుంట మండలాల్లోని 29 గ్రామాలకు స్మశాన వాటికలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.