హనుమాన్ జయంతికి ముస్తాబవుతున్న ఆలయాలు

హనుమాన్ జయంతికి ముస్తాబవుతున్న ఆలయాలు

NRML: రేపు నిర్వహించే ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పలువురు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కోరారు.