ఇల్లు విడిచి వెళితే పోలీసులకు తెలియజేయండి: ఎస్పీ

ఇల్లు విడిచి వెళితే పోలీసులకు తెలియజేయండి: ఎస్పీ

గుంటూరు: జిల్లా ప్రజలు ఇల్లు విడిచి కొన్ని రోజులపాటు బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు బయటకు వెళ్లేప్పుడు తమ పరిధిలోని పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. గుంటూరు జిల్లా పోలీస్ కంట్రోల్ రూం  8688831568కు తెలియజేస్తే.. వారి ఇంటికి సీసీ కెమెరాలు ( ఎల్ ఎం హెచ్ ఎస్) అమర్చుతారని ఎస్పీ సూచించారు.