పెనుకొండ ఆర్డీవోకు జర్నలిస్టుల వినతి
సత్యసాయి: పెనుకొండలో జర్నలిస్టులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. చిలమత్తూరు విలేకరిపై దాడి చేసిన నాగరాజు యాదవ్, అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీవో ఆనంద్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.