గిరిజన సంస్కృతికి అపార గౌరవం: ఏఎస్పీ

గిరిజన సంస్కృతికి అపార గౌరవం: ఏఎస్పీ

ASF: గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయని, వాటి పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని ఆసిఫాబాద్ అదనపు ఎస్పీ చిత్తరంజన్ అన్నారు. శనివారం తిర్యాణి మండలంలోని అర్జున్ లోద్దిలో గిరిజనులు నిర్వహిస్తున్న భీమన్న, పాండవుల జాతరకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనులు ప్రకృతితో మమేకమై జీవిస్తారని పేర్కొన్నారు.