మహిళల రక్షణకు పోలీసుల ప్రత్యేక చర్యలు

మహిళల రక్షణకు పోలీసుల ప్రత్యేక చర్యలు

KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కాలనీలు, గ్రామాల్లో మహిళా భద్రతపై పోలీస్ అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల రక్షణకు బీ.ఎన్.ఎస్‌లో ఉన్న చట్టాలు, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా దుర్వినియోగంపై వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112,1091,1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్లు వినియోగంపై మహిళలకు సూచనలు చేశారు.