DREAM 11 మూత పడినట్లేనా..?

DREAM 11 మూత పడినట్లేనా..?

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని ప్రముఖ ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11.. తన వ్యాపారాన్ని మూసివేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో యూజర్లు తమ డబ్బును వాలెట్ల నుంచి వెనక్కి తీసుకుంటున్నారు. అయితే డ్రీమ్11 ప్రస్తుతం ఇండియా మెన్స్, ఉమెన్స్ జట్లకు స్పాన్సర్‌గా ఉంది. ఈ బిల్లు వల్ల BCCIకి రూ.358 కోట్ల నష్టం వాటిల్లనుంది.