పదవి విరమణ పొందిన ఏఎస్సైకి సత్కారం

KNR: కరీంనగర్ కమీషనరేట్‌లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తూ పదవీకాలం ముగిసిన ఏఎస్సై మహమ్మద్ గౌస్ ఖాన్ 35 సంవత్సరాలు సుదీర్ఘ కాలంపాటు పోలీసు శాఖకు సేవలందించి నేటితో పదవి విరమణ పొందారు. పదవి విరమణ పొందుతున్న ఏఎస్సై ఎం.డి. చాంద్ పాషాకి అడిషనల్ డీసీపీ ఏ.లక్ష్మీనారాయణ చేతుల మీదుగా పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వారికి జ్ఞాపిక అందచేశారు.