VIDEO: ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ దాడులు
VSP: సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. అగనంపూడి టోల్ గేట్ వద్ద ఆదివారం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు 25 ప్రైవేట్ బస్సులను తనిఖీ చేయగా, నిబంధనలు ఉల్లంఘించిన మూడు బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రయాణికుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడినా, నిబంధనలు పాటించకపోయినా చర్యలు తీసుకుంటామన్నారు.