ప్రభుత్వ ఉద్యోగుల జంగ్‌సైరన్

ప్రభుత్వ ఉద్యోగుల జంగ్‌సైరన్

TG: హామీల అమలు కోసం జంగ్ సైరన్ మోగిస్తామని ప్రభుత్వ ఉద్యోగ జేఎసీ వెల్లడించింది. 200లకు పైగా ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాడుతున్నామని తెలిపింది. 'హామీల అమలుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. హామీలు అమలు కాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. రిటైర్డ్ అయ్యి రెండేళ్లయినా బెనిఫిట్స్ రావడం లేదు. సెప్టెంబర్ 1న 'పెన్షన్ విద్రోహ దినం' నిర్వహిస్తాం' అని ప్రకటించింది.