'లాభాలను ప్రకటించి 40శాతం చెల్లించాలి'

'లాభాలను ప్రకటించి 40శాతం చెల్లించాలి'

ASF: సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించి 40 శాతం కార్మికులకు చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కార్మికులకు లాభాల్లో 40 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు.