VIDEO: 4 ఎకరాల పంట నష్టం.. రైతు ఆందోళన
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన రైతు పోతునూక నాగేశ్వరరావు, సాయి లక్ష్మి ఫెర్టిలైజర్స్ దుకాణంలో కొనుగోలు చేసిన కలుపు నివారణ మందులు పిచికారి చేయగా వికటించి నాలుగు ఎకరాల వరిపొలం దెబ్బతింది. దీంతో రైతు, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులతో కలిసి శనివారం దుకాణం ఎదుట ఆందోళన చేపట్టి, నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.