శివంపేట మండలంలో వివాహిత అదృశ్యం

శివంపేట మండలంలో వివాహిత అదృశ్యం

MDK: శివంపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన పవిత్ర(19) అదృశ్యమైనట్లు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. గొల్ల నాగరాజుతో 7 నెలల క్రితం కొల్చారం మండలం కిష్టాపూర్‌కు చెందిన పవిత్రతో వివాహం జరిగింది. తల్లిగారి ఇంటి నుంచి తెచ్చుకున్న ఫోన్ విషయంలో గొడవ జరిగింది. ఈ విషయంలో మనస్థాపానికి గురై నిన్న ఇంట్లోంచి వెళ్లి అదృశ్యం కాగా, ఈరోజు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.