దీక్ష చేపట్టనున్న పాడి కౌశిక్ రెడ్డి
TG: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ దీక్ష చేపట్టనున్నారు. హుజూరాబాద్ మండలం సిరిసనపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఈ నిరసన తెలుపుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా జనావాసాల మధ్య డంప్ యార్డ్ వద్దని డిమాండ్ చేస్తూ.. 48 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది.