'పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి'
NZB: మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతుకూలీ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్యాన్ మాల్వియాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రైతులు నట్టేట మునిగి ఆందోళన చెందుతుంటే రైతుల గోస పాలకులకు పట్టడం లేదని విమర్శించారు.