సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించిన ఎమ్మెల్యే
HNK: ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో సమ్మక్క-సారలమ్మ తల్లులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సమ్మక్క–సారలమ్మ తల్లుల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రాంతం మరింత అభివృద్ధి చెంది ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.