VIDEO: పాఠశాలలో సైన్స్ డే సందడి
SRD: ఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం విద్యార్థులు జాతీయ సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థుల సందడి నెలకొంది. రంగుల రంగవల్లికలతో సైన్స్‌కు సంబంధించిన వివిధ రకాల చిత్రాలను రూపొందించారు. మానవ శరీరం, గుండె, సైన్స్ పరికరాలు, అంతేకాకుండా భారత శాస్త్రవేత్త సివి రామన్ చిత్రాన్ని కూడా రంగవల్లికలతో చిత్రీకరించారు.