'అవకాశాలు వినియోగించుకోవాలి'

MNCL: అవకాశాలను వినియోగించుకొని మహిళలు ముందుకు సాగాలని జన్నారం మండల ఎస్సై గొల్లపల్లి అనూష, వ్యవసాయ అధికారి సంగీత, ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కోర్టు విజయశంకర్ కోరారు. ఈరోజు మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు కొడుకులతో పాటు ఆడపిల్లలను కూడా సమానంగా చూడాలన్నారు. పట్టుదలతో మహిళలు ముందుకు సాగాలని అన్నారు.