తెలుగు సంబరాల్లో పాల్గొనాలని హోంమంత్రికి ఆహ్వానం

VSP: నాట్స్ ఆధ్వర్యంలో జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగే అమెరికాలో నిర్వహించే తెలుగు సంబరాల్లో పాల్గొనాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం విజయవాడలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ విషయాన్ని హోంమంత్రి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.