కోడుమూరులో యువకుడి ఆత్మహత్య
KRNL: కోడుమూరులోని ఎస్సీ బాలుర హాస్టల్ వెనుక నరసప్ప బావిలో దూకి వీరేశ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగార్జున, సుశీలమ్మ దంపతుల కుమారుడైన వీరేశ్ నిన్నటి నుంచి కనిపించకపోగా శుక్రవారం బావిలో శవమై కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.