అశ్వవాహన సేవతో ముగిసిన ఉగాది వేడుకలు
NDL: ఉగాది మహోత్సవాల చివరి రోజు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. అక్క మహాదేవి అలంకార మండపంలో ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై ప్రతిష్ఠించి ప్రత్యేక అలంకరణ చేశారు. అర్చకులు, వేదపండితులు పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవం జరిపి భక్తులకు దర్శనం కల్పించారు.