ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి: ఎమ్మెల్యే
VKB: 100 ఏళ్ల చరిత్ర కలిగిన పరిగి కోర్టులో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని... దీనివల్ల న్యాయ ప్రక్రియ ఆలస్యం అవుతోందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. పరిగి పరిధిలో ఒక కొత్త కోర్టును మంజూరు చేయాలన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులపై అప్పట్లో నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేయాలని అన్నారు.