'1334 కేసులు పరిష్కారం'
AKP: చోడవరం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1334 కేసులు పరిష్కారమయ్యాయి. వాటిలో 19 సివిల్ కేసులు, 1315 క్రిమినల్ కేసులు ఉన్నట్లు సీనియర్ సివిల్ జడ్జి వి.గౌరీ శంకర్రావు తెలిపారు. లోక్ అదాలత్‌లో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి.స్వర్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.సూర్యకళ పాల్గొన్నారు.