ఖాజీపేట సీఐ సూచనలు

KDP: వినాయక చవితిని పురస్కరించుకొని గ్రామాలలో ఏర్పాటు చేసుకోనున్న వినాయక విగ్రహాలకు పోలీసుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సీఐ మోహన్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా, శబ్ద కాలుష్యం లేకుండా ప్రశాంతంగా పండగను నిర్వహించుకోవాలన్నారు. గొడవలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.