కాశీబుగ్గ తొక్కిసలాట బాధాకరం: కేంద్రమంత్రులు
AP: కాశీబుగ్గ తొక్కిసలాట బాధాకరమని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.