గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

KDP: పులివెందుల పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి పార్లపల్లి రోడ్డుకు వెళ్లే దారిలో గల బీడు భూమిలో శనివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు తెల్ల చొక్కా, పసుపు రంగు పంచె ధరించి ఉన్నాడు. సాయంత్రం వేళ పొలం పనులకు వెళ్లిన ఓ రైతు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.