'వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

ADB: వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్ తెలిపారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేయడం జరిగిందన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.