హంసలదీవి పర్యాటకులకు కీలక సూచనలు

హంసలదీవి పర్యాటకులకు కీలక సూచనలు

కృష్ణా: కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్దకు వచ్చిన పర్యాటకులకు మెరైన్ పోలీసులు సూచనలు చేశారు. వీటిని తప్పక పాటించాలని పాలకాయ తిప్ప మెరైన్ ఎస్సై పూర్ణ మాధురి అన్నారు. ఆదివారం బీచ్ వద్దకు వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన పర్యాటకులకు స్నానాలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించారు. సముద్రంలో లోతుకు వెళ్లవద్దని తెలిపారు.