కార్మికులకు జీతాలు రాట్లే.. కాంట్రాక్ట్ రద్దుకు డిమాండ్..!
MDCL: ఉప్పల్ ఎంటమాలజీ కార్మికులకు వేతనాలు అందకపోవడం ఆవేదనకు గురిచేస్తోంది. నెలలో 1 నుంచి 5వ తేదీ మధ్య వేతనాలు చెల్లించాలనే నిబంధనలను కాంట్రాక్టర్ ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్ పట్టించుకోలేదని కార్మికులు తెలిపారు. ఫోన్ చేసినా స్పందించకపోవడం లేదని, ఇలాంటి కాంట్రాక్టర్‌ను వెంటనే బ్లాక్‌లిస్ట్ చేసి, కార్మికులకు తక్షణమే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.