పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నాయకుల ధర్నా

పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నాయకుల ధర్నా

SS: హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం రాత్రి వైసీపీ నాయకుడు వేణురెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కౌన్సిలర్ ఆసీఫ్‌పై పోలీసులు దాడి చేశారని ఆయన తెలిపారు. కేవలం వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్లు శివ, దాదూ తదితరులు పాల్గొన్నారు.