'ప్రమాద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి'

KMR: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో రోడ్డుపై సూచికలు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని రిజొల్యూషన్ టీమ్ పేర్కొన్నారు. యాక్సిడెంట్ రిజొల్యూషన్ టీం ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రమాదాలపై భద్రతకు సంబంధించిన చర్యలు, జాగ్రత్తలు ART టీం అధ్యయనం చేసింది. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్, ఆర్టీఏ బిక్షపతి, ఎస్సై ఆంజనేయులు, ఏఈ రవితేజ పాల్గొన్నారు.