బిగ్ బాస్ విజేత కళ్యాణ్‌కు సత్కారం
VSP: బిగ్ బాస్ సీజన్-9 విజేత కళ్యాణ్ పడాల ఇవాళ నగరంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు నివాసంలో కళ్యాణ్‌ను ఘనంగా సత్కరించి, శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన గుర్తింపుకు ప్రజల ఆదరాభిమానాలే కారణమని కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.