యువత చేతిలోనే దేశ భవిష్యత్: ఎమ్మెల్యే
SRD: భారతదేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా పటాన్ చెరులో ఏక్తా దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని చెప్పారు. సీఐ వినాయక్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.