కైలాస మానస సరోవరం పుస్తకావిస్కరణ

VZM: విజయనగరం స్థానిక బుక్కావీధి, ఆర్యసోమయాజుల భవనంలో మంగళవారం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుస్తకావిస్కరణ జరిగింది. ఆకెళ్ళ వెంకటేశ్వరరావు రచించిన భక్త మానసోల్లాస భరితం - కైలాస మానస సరోవరం, మరియు NK బాబు రచించిన వెన్నెల కథలు పుస్తకాల ఆవిష్కరణ చేశారు. అనంతరం కైలాసగిరి పరిపూర్ణ పరిక్రమ చేసిన దత్తాత్రేయ ఉపాసకులు భావరాజు వీర్రాజును సన్మానించారు.