'నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి'

ADB: చుట్టుపక్కల పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని హెల్త్ ఎడ్యుకేటర్ రవీందర్ సూచించారు. గాదిగూడ మండల కేంద్రంలో ఝరి ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వర్షాకాలం నేపథ్యంలో ప్రబలుతున్న వ్యాధులపై ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించారు. దోమలు వృద్ధి చెందటంతో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు. AWT సుభద్ర, తదితరులున్నారు.