సుబ్బరామిరెడ్డి సేవలు చిరస్మరణీయం: MLA
NLR: ఒంగోలులోని పీవీఆర్ గ్రౌండ్స్‌లో మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతి కార్యక్రమం సోమవారం జరిగింది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. కందుకూరులో తాగునీటి సమస్య సమయంలో సుబ్బరామిరెడ్డి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు.