తెలంగాణలో HCA సమ్మర్ క్రికెట్ క్యాంప్స్

తెలంగాణలో HCA సమ్మర్ క్రికెట్ క్యాంప్స్

తెలంగాణ క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) గుడ్‌న్యూస్ చెప్పింది. ఔత్సాహిక యువ క్రికెటర్ల కోసం వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అండర్ 14, 16, 19 బాల, బాలికల కోసం మే 6 నుంచి జూన్ 5 వరకు ఉచితంగా సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఆసక్తి గలవారు మే 4లోపు www.hycricket.orgలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.