VIDEO: మహిళా శక్తి పథకంతో మహిళలకు ఆర్థిక బలోపేతం: మంత్రి

MLG: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. జిల్లాలో వీ హబ్ ఆధ్వర్యంలో మంగళవారం మహిళా పారిశ్రామికవేత్తలతో ర్యాంప్ ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.