పాలిటెక్నిక్ కళాశాల స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

పాలిటెక్నిక్ కళాశాల స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

RR: ఫరూఖ్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో పాలిటెక్నిక్ కళాశాల స్థలాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో వెంటనే పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం కూడా త్వరలోనే పూర్తవుతుందని, దీని ద్వారా విద్యా వ్యవస్థ మరింత ముందడుగు వేస్తుందన్నారు.