యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం
కృష్ణా: గుడివాడ యూనియన్ బ్యాంకులో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. బైపాస్ రోడ్డులోనీ బ్యాంక్ కార్యాలయం నుండి పొగలు రావడంతో స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.బ్యాంక్ అద్దాలు పగల కొట్టి మంటలను అదుపు చేశారు.