'వందమందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ'

'వందమందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ'

VSP: భీమిలిలో గంటా శారద హెల్పింగ్ హాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం కళ్లద్దాలను ఉచితంగా అందజేశారు. ఇటీవల భీమిలి నీడ్ వెల్ఫేర్, వెంపాడ వెల్ఫేర్ సొసైటీలు నిర్వహించిన శిబిరంలో గుర్తించిన వంద మందికి గంటా శారద హెల్పింగ్ హాండ్స్ సొసైటీ అధ్యక్షురాలు రూ. 30 వేలు విలువ చేసే కళ్లద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు జీవన్ తదితరులు పాల్గొన్నారు.