VIDEO: జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వాన

VZM: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం వర్షాలు దంచి కొడుతున్నాయి. నిలకడగా వర్షం కురుస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజాం, బొబ్బిలి, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది. భోగాపురం, పూసపాటిరేగ సముద్ర తీరాల్లో అలల ఉధృతి పెరిగిందని మత్స్యకారులు చెబుతున్నారు.