ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య తీవ్ర ఉద్రిక్తత
ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హెజ్‌బొల్లా దాడులతో ఉత్తర ఇజ్రాయెల్‌లో దాదాపు 60 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ లెబనాన్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు.