నేడు రాయచోటిలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు

నేడు రాయచోటిలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు

అన్నమయ్య: రంజాన్ ఉపవాసాలు ముగిశాయి. ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని హజరత్ జమానుల్లా భాష ఈద్గా ప్రాంగణంలో శనివారం ఉదయం 8.30 గంటలకు ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేయనున్నారు. మతగురువు సర్కాజీ సర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేస్తామని ఈద్గా కమిటీ సభ్యుడు బేపారి మహమ్మద్ ఖాన్ తెలిపారు. ముస్లిం సోదరులు ఉదయం 8 గంటల లోపు ఈద్గాకు చేరుకోవాలని ఆయన సూచించారు.