బెట్టింగ్స్ నిర్వహిస్తే సహించేది లేదు: ఎస్సై
ప్రకాశం: ఇటీవల జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లకు బెట్టింగులు నిర్వహిస్తే సహించేది లేదని పొదిలి ఎస్సై రాజేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. యువత జూదాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలియజేశారు. తక్కువ సమయంలో, ఎక్కువ మనీని సంపాదించాలని అత్యాశకు పోయి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.