శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ సూటి ప్రశ్న

అంతరిక్ష రంగంలో విజయాలు సాధించడం భారత్‌కు అలవాటుగా మారిందని PM మోదీ పేర్కొన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. 2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై జెండా ఎగురవేస్తారని తెలిపారు. భవిష్యత్తులో ఏటా 50 రాకెట్లు ప్రయోగించగలమా? అని శాస్త్రవేత్తలను ప్రశ్నించి, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.