'విశాఖలో పార్కులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి'
VSP: విశాఖలో పార్కులు, చెరువులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం ఆయన 8వ జోన్, 96వ వార్డు పరిధిలోని గోకాడ చెరువు, సూర్య నగర్‌లోని పార్కును పరిశీలించారు. మేయర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఈ పార్కులు, చెరువుల అభివృద్ధి అవసరమని తెలిపారు.