పెద్ద పేటలో సోషల్ ఆడిట్

SKLM: బూర్జ మండలం, పెద్దపేట పంచాయతీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా "సామాజిక తనిఖీ అవగాహన ర్యాలీ" సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు హాజరై వేతనదారులకు సామాజిక తనిఖీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామ ముఖ్య నాయకులు , ప్రజలు పాల్గొన్నారు.