మారేమండలో 'సుపరిపాలనలో తొలి అడుగు'

NTR: విస్సన్నపేట మండలం మారేమండ గ్రామంలో సోమవారం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం జరిగింది. టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్బారావు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.